వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌కు ఆయుధాలను సరఫరా చేసే ఏ దేశమైనా అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై 50శాతం టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’ లో ట్రంప్ ఒక పోస్ట్ పెట్టారు.
‘‘ఇరాన్‌కు ఆయుధాలను సరఫరా చేసే దేశాలపై తక్షణమే 50 శాతం టారిఫ్ విధిస్తాం. అమెరికాకు ఆ దేశాలు విక్రయించే అన్ని రకాల వస్తువులపై ఈ సుంకం వర్తిస్తుంది. ఇందులో ఎటువంటి మినహాయింపులు ఉండవు’’ అని స్పష్టం చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. దీనివల్ల అంతర్జాతీయ సప్లయ్ చెయిన్ దెబ్బతినడమే కాకుండా, అగ్రరాజ్యంతో ఇతర దేశాల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
