
ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామమందిర నిర్మాణాన్ని 2022 నాటికి పూర్తిచేస్తామన్నారు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టీ కామేశ్వర్ చౌపాల్. మందిర నిర్మాణం గురించి చర్చించేందుకు ఆలయ కమిటీ ఈనెల 18న ఢిల్లీలో మొదటిసారి భేటీకానుందని ఆయన తెలిపారు. అయితే ఆలయ నిర్మాణానికి 67 ఎకరాలు సరిపోదని చెప్పారు.. ప్రస్తుతం తాము 67ఎకరాలను చదును చేయించి ప్రధాని మోడీతో శంకుస్థాపన చేయిస్తామని అన్నారు.