ఎండాకాలం దోమ కుట్టిందా.. వెంటనే ఇలా చేయండి.. లేకపోతే రోగాల బారిన పడతారు..!

ఎండాకాలం దోమ కుట్టిందా.. వెంటనే ఇలా చేయండి.. లేకపోతే రోగాల బారిన పడతారు..!

ఎండాకాలం..ఇంట్లో వేడిగా ఉండటం సహజం..దీంతో చాలామంది పేద,మధ్యతరగతి ప్రజలు ఇంటికి ఉన్నకిటికీలు, తలుపులు తీసి పడుకుంటారు.. ఇదే సమయం లో దోమలు ఇంట్లోకి వచ్చేస్తాయి..మరి దోమలతో కుట్టించుకుని డెంగ్యూ వంటి తీవ్ర అనారోగ్యం బారిన పడేకంటే..దోమ కుట్టిన తర్వాత..వంటింట్లోని నిత్యావస రాల తో ఇలా ఉపసమనం పొందొచ్చు..అవి ఏంటో.. ఎలా చేయాలో తెలుసుకుందామా...

తేనె రాయండి:

దోమ కుట్టిన తర్వాత అక్కడ దద్దుర్లు లేదా ఎర్రగా వచ్చినట్లయితే ఆ ప్రాంతంలో తేనెను రాయండి. తేనెకు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దీంతో ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. అంతే కాకుండా దురదను తగ్గిస్తుంది. తేనె తినటమే కాదు.. ఇలా చికిత్స కింద కూడా బాగా పడిచేస్తుంది. దోమ కాటు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

బేకింగ్ సోడా:

మార్కెట్ లో ఈజీగా దొరుకుతుంది. దోమ కాటు ప్రదేశంలో బేకింగ్ సోడాను నీళ్లలో కలిపి అప్లయ్ చేయండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడగండి. దోమ కుట్టిన చోట దురద, దద్దర్లు ఉంటే తగ్గిపోతాయి.

ఐస్ క్యూబ్స్:

దోమ కాటు వేసిన చోట ఐస్ క్యూబ్ తో రుద్దండి. బొబ్బలు ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. దురద కూడా వెంటనే తగ్గుతుంది. ఐస్ క్యూబ్ ను నేరుగా చర్మంపై రుద్దటం కంటే.. ఏదైనా గుడ్డ ముక్కలో చుట్టి అప్లయ్ చేయటం మంచిది.

వెల్లుల్లి రెబ్బలు:

దోమ కుట్టిన తర్వాత ఆ ప్రాంతంలో నొప్పి, దురద, దద్దర్లు వచ్చినట్లయితే.. వెంటనే మన వంటింటిలోని వెల్లుల్లిని ఆ ప్రాంతంలో దుద్దాలి. వెల్లుల్లి మెత్తగా చేయటం వల్ల వచ్చే రసంను.. దోమ కాటు ప్రాంతంలో అప్లయ్ చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. దురద, దద్దుర్లు వెంటనే తగ్గిపోతాయి. 

టీ బ్యాగ్:

మనం ఇంట్లో టీ కోసం ఉపయోగించే టీ బ్యాగ్ లేదా కాచిన టీ పౌడర్ ను దోమ కాటు చోట ఉంచటం వల్ల.. ఎలాంటి ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడొచ్చు.

ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉండేవే.. అదే విధంగా ప్రతి ఇంటికి వచ్చే దోమలే.. దోమలు కుట్టటం ద్వారా మరింత ఇన్ఫెక్షన్ సోకకుండా ముందస్తు జాగ్రత్తగా ఇలాంటి వంటింటి చిట్కాల ద్వారా వెంటనే ఉపశమనం పొందొచ్చు. ఇలాంటి చికిత్స తర్వాత కూడా దోమకాటు నుంచి ఉపశమనం పొందనట్లయితే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించండి..

ALSO READ :- టయోటా గ్లాంజా కార్లలో ఇంజిన్ ప్రాబ్లమ్స్..రీకాల్ చేసిన కంపెనీ