టయోటా గ్లాంజా కార్లలో ఇంజిన్ ప్రాబ్లమ్స్..రీకాల్ చేసిన కంపెనీ

టయోటా గ్లాంజా కార్లలో ఇంజిన్ ప్రాబ్లమ్స్..రీకాల్ చేసిన కంపెనీ

జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా తన ఉత్పత్తుల్లో ఒకటైన టయోటా గ్లాంజా మోడల్ కార్లను ఇండియాలో రీకాల్ చేసింది. మొత్తం 2019 ఏప్రి ల్2నుంచి అక్టోబర్ 6,2019 వరకు తయారు చేయబడిన టయోటా గ్లాంజా మోడల్ కార్లలో ఫ్యుయెల్ పంప్ మోటార్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంగీకరించింది.  ఇండి యా మొత్తం అమ్ముడైన 2305 గ్లాంజా హ్యాచ్ బ్యాక్స్ కార్లలో ఇంజిన్ పరమైన లోపాలున్నాయని.. వాటిని రిపేర్ సరిదిద్దేందుకు రీకాల్ చేస్తున్నట్టు తెలిపింది. 

టయోటా గ్లాంజా నాలుగు వేరియంట్లలో వచ్చింది. ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్లతో E,S,G, V వేరియంట్లతో రూ.6.86 లక్షల నుంచి రూ 10 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో గ్లాంజా రేంజే విక్రయించబడ్డాయి. 

గత కొద్ది రోజల క్రితమే మారుతి సుజుకీ కూడా 11,851 బాలెనో కార్లను ఇదే ఇంజిన్ సమస్యతో రీకాల్ చేసింది. ఇవి కూడా జూలై 30,2019 నుంచి నవంబర్ 1,2029 మధ్యలో తయారు చేయబడ్డాయి. గ్లాంజా, బాలెనో రెండు ట్విన్స్ లా ఉంటాయి.ఇవి చాలా పార్ట్స్ ను షేర్ చేసుకున్నాయి. 

ALSO READ :- Family Star Movie Sensor: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్..ర‌న్‌టైం ఎంతంటే?

టయోటా గ్లాంజా కార్లలో తరుచుగా ఫ్యుయెల్ పంప్ మోటార్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి..దీంతో  ఇంజన్ సడెన్ గా ఆగిపోవడం, స్టార్ట్ చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయని  కంపెనీ గుర్తించినట్లు తెలిపింది. రీకాల్ రూల్స్ ప్రకారం.. ఆయా కార్ల ఓనర్లకు  సమాచారం ఇవ్వడం జరిగింది. ఇంజిన్ సమస్యలను ఎటువంటి ఛార్జీలు లేకుండా పరిష్కరించనున్నట్లు కంపెనీ తెలిపింది. తనిఖీలు, కారు విడి భాగాల రీప్లేస్ మెంట్ అంతా ఎటువంటి ఛార్జీలు ఓనర్లు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.