Family Star Movie Sensor: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్..ర‌న్‌టైం ఎంతంటే?

Family Star Movie Sensor: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్..ర‌న్‌టైం ఎంతంటే?

స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్ (Family Star).సీతారామం(Sitaramam)ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (SVC54) పై దిల్ రాజు (Dil raju) నిర్మిస్తున్నారు.

రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్,ట్రైలర్,సాంగ్స్ ఆడియన్స్ని వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్తో మేకర్స్ ప్రమోషన్స్లో వేగం పెంచేశారు.మరి ఈ సినిమా రన్ టైం ఎంతవరకు ఉందో వివరాలు తెలుసుకుందాం. 

లేటెస్ట్గా ఫ్యామిలీ స్టార్ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది.సెన్సార్ బోర్డు స‌భ్యులు ఫ్యామిలీ స్టార్‌ సినిమాకు ‘యు/ఏ’ స‌ర్టిఫికేట్‌ ఇచ్చారు. ఈ మూవీ ర‌న్‌టైం 150 నిమిషాలు ఉన్న‌ట్లు మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ALSO READ :- కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు పంపించి బెదిరించాలని చూస్తుండు : యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

‘ఈ వేసవిలో వేడుకలు చేసుకుందాం. మీ ఫ్యామిలీ స్టార్‌ 150 నిమిషాల సంపూర్ణ వినోదంతో వస్తోంది.రేపు (ఏప్రిల్ 5న) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. వెంటనే మీ టిక్కెట్లను బుక్ చేసుకోండి’ అని శ్రేయాస్ మీడియా తన ఎక్స్‌లో తెలిపింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆలస్యం చేయకుండా ఫ్యామిలీ స్టార్ తో 2.30 గంటలు ఎంజాయ్ చేయడానికి సిద్ధం అవ్వండి.