జూన్ 2 నుంచి టీఎస్-బీపాస్ అమలు

జూన్ 2 నుంచి టీఎస్-బీపాస్ అమలు
  • అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అమలు

మున్సిపాలిటీలు, మున్సిపల్​కార్పొరేషన్లు, గ్రేటర్​ హైదరాబాద్​లో భవన నిర్మాణాలకు 21 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేందుకు రూపొందించిన టీఎస్‌– బీపాస్‌ విధానాన్ని జూన్​2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మున్సిపల్​శాఖ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇక నుంచి ఆన్ లైన్ లోనే బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవచ్చు. మీ సేవ సెంటర్లు, పౌర సేవ కేంద్రాలతో పాటు సొంతంగా కంప్యూటర్, మొబైల్ యాప్ ద్వారానూ అప్లై చేసుకోవచ్చు. దీనికోసం టీఎస్​‌‌– బీపాస్​పేరుతో ప్రత్యేకంగా వెబ్ ​పోర్టల్​ రూపొందించారు. అప్లికేషన్ లో ఏవైనా ఇబ్బందులుంటే అధికారులతో మాట్లాడేందుకు 040–22666666 టోల్​ ఫ్రీ నంబర్​ను ఏర్పాటు చేశారు. టీఎస్ – బీపాస్​ను మొదట పైలట్ ప్రాజెక్టుగా 87 మున్సిపాలిటీల్లో ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 1,100 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు.