రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ (అగ్రికల్చర్ స్ట్రీమ్) పరీక్షలు వాయిదా వేసినట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ నెల 18,19 20 న జరగాల్సిన ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ పరీక్షలు యథావిధిగా జరగనున్నాయని తెలిపింది. వాయిదా పడిన పరీక్షల తేదీలను త్వరలో ఖరారు చేస్తామని ప్రకటించింది.
ఈ సారి ఎంసెట్‌కు విపరీతమైన పోటీ ఉంది. ఇంజనీరింగ్‌కు 1,71,945, అగ్రికల్చర్, మెడికల్‌కు 94,150, రెండింటికీ దరఖాస్తు చేసినవారు 350, మొత్తం 2,66,445 దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి 14,722 దరఖాస్తులు ఎక్కువ వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఈ నెల 14, 15 తేదీల్లో.. అగ్రికల్చర్, మెడికల్, 18, 19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి.
