
తెలంగాణ ఈసెట్ (TS ECET ) హాల్‌టికెట్లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈసెట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ecet.tsche.ac.in నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. కంప్యూటర్ ఆధారితంగా జరిగే ఈ పరీక్షను ఆగస్టు 31న నిర్వహించున్నారు. కరోనా క్రమంలో హాల్‌టికెట్‌లో తెలిపిన సూచనలను విద్యార్థులు తప్పనిసరిగా పాటించాలని కోరింది. ఈసెట్ ద్వారా డిప్లొమా, బీఎస్సీ మ్యాథ్స్ పూర్తి చేసినవారికి ఇంజినీరింగ్ రెండో ఏడాదిలోకి ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ పొందవచ్చు. రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష సెప్టెంబర్ లో జరగనుంది.