ఎడ్ సెట్ ఎగ్జామ్..గంటన్నర ముందే అనుమతి

ఎడ్ సెట్ ఎగ్జామ్..గంటన్నర ముందే అనుమతి

హైదరాబాద్, వెలుగు : బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్​ఎడ్ సెట్–2023 ఎగ్జామ్ గురువారం జరగనున్నది. మొత్తం 31,725 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం స్టేట్ వైడ్​గా 49 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎడ్ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రామకృష్ణ తెలిపారు.

ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు, మధ్యాహ్నం 12.30గంటల నుంచి 2.30గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 6గంటల వరకు మూడు సెషన్లలో పరీక్షను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రతిసెషన్​లో 10,500లకు పైగా అభ్యర్థులు పరీక్షకు అటెండ్ అయ్యేలా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి గంటన్నర ముందే అనుమతిస్తున్నా మని పేర్కొన్నారు.