హైకోర్టుకు ఆర్టీసీ అఫిడవిట్

హైకోర్టుకు ఆర్టీసీ అఫిడవిట్

ఆర్టీసీ స్థితి గతులను వివరిస్తూ ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్  సమర్పించింది. ఈనెల 8వ తేదీ వరకూ మొత్తం ఆర్టీసీ బకాయిలు 2వేల 209 కోట్లు ఉన్నట్లు ప్రభుత్వం అఫిడవిట్ లో తెలిపింది. ఇందులో పీఎఫ్  బకాయిలు 788 కోట్లు, క్రెడిట్  కోఆపరేటివ్  సొసైటీ బకాయిలు 500కోట్లు, లీవ్  ఎన్ క్యాష్ మెంట్  180 కోట్లు, రిటైర్డ్  ఎంప్లాయీస్  సెటిల్ మెంట్స్ 52 కోట్లు, ఎంవీ యాక్ట్ కింద 452 కోట్లు, హెచ్ ఎస్ డి ఆయిల్ బిల్స్ 34 కోట్లు, హెచ్ వో, రిజియన్, జోన్ ఇతర బకాయిలు మరో 36 కోట్లుగా తేల్చింది సర్కార్.