బ‌త్తాయి, నిమ్మ రైతుల‌ను ఆదుకోవాలి

బ‌త్తాయి, నిమ్మ రైతుల‌ను ఆదుకోవాలి

కరోనా దెబ్బ నుండి బత్తాయి, నిమ్మ రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రైతులతో సీఎం కేసీఆర్ చర్చించి పంట గిట్టుబాటు ధర నిర్ణయించాలన్నారు. నాగపూర్ మార్కెట్ లో అందే ధరను నిర్ణయించి ఇక్కడి రైతులను ఆదుకోవాలని.. సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఈ విపత్కర పరిస్థితులను తట్టుకోవడానికి బత్తాయి మంచి ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు.సీఎం కేసీఆర్ మాటలను చేతల్లో చూపించాలని..సివిల్ సప్లై శాఖ ద్వారా రైతుల వద్ద గిట్టుబాటు ధరకు కొని రేషన్ షాపుల ద్వారా పేదలకు బత్తాయి, నిమ్మకాయలను అందించాలన్నారు. ఖరీఫ్ లో వరి రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చెప్పారు. అధికారుల పేరుతో రైతులకు ఆంక్షలు తగవని… టోకెన్ అమలులో అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి రైతులకు అందించాలని తెలిపారు.

పాత విధానం ద్వారా ఐకెపి సెంటర్లలో కొనుగోలుకు ప్రయత్నాలు చేపట్టి ముమ్మరం చేయాలని..
మిల్లర్లతో మాట్లాడి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని స్టోరేజీలకు తరలించేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలన్నారు. కూలీల కొరతను అధిగమించడనికి వరి కోత మిషన్స్ (ఆర్వెస్టర్స్) కు పోలీసుల ఆంక్షలను నుండి మినహాయింపు ఇవ్వాలని తెలిపారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల వలన రైతులకు నష్టం కలగక ముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు బండి సంజ‌య్.