సాంస్కృతిక సారథులకు 30% వేతనాల పెంపు

సాంస్కృతిక సారథులకు  30%  వేతనాల పెంపు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాంస్కృతిక సారథి(టీఎస్ఎస్) ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసింది. ఈ మేరకు సాంస్కృతిక, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. 

పీఆర్సీ 2020 ప్రకారం టీఎస్ఎస్ ఉద్యోగులకు పీఆర్సీ అందుతుంది. దీని ప్రకారం ప్రస్తుత పేస్కేల్​ మీద 30 శాతం వేతనాలు పెరగనున్నాయి. వారికి ప్రస్తుత పే స్కేలు రూ. 24,514 గా ఉంది. పీఆర్సీ అమలుతో ఒక్కొక్కరికి రూ.7,300 మేరకు జీత భత్యాలు పెరిగే అవకాశం ఉంది. 

పెంచిన పీఆర్సీ 2021 జూన్ 1 నుంచి వర్తింపజేస్తున్నారు. టీఎస్ఎస్​లో మొత్తం 583 మంది ఉద్యోగులు ఉన్నారు. పీఆర్సీ అమలుకు తదుపరి చర్యలు తీసుకోవాలని భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కు ప్రభుత్వ ఆదేశించింది. 3 నెలల కింద టీఎస్ఎస్ ఉద్యోగుల పీఆర్సీకి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వగా సీఎం కేసీఆర్ ఆమోదంతో తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.