రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టులు

రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీల్లో  3,897 పోస్టులు

హైదరాబాద్, వెలుగు: జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటులో భాగంగా వచ్చే ఏడాది ప్రారంభించనున్న 9 కొత్త మెడికల్ కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థికశాఖ గురువారం జీవో జారీ చేసింది. ఒక్కో కాలేజీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కలిపి 33 కేడర్లలో 433 పోస్టులకు అనుమతి ఇచ్చింది. ఈ పోస్టులను క్రియేట్ చేయడానికి మాత్రమే ప్రస్తుతం పర్మిషన్ ఇవ్వగా, భర్తీ చేయడానికి మరోసారి అనుమతి తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొంది. రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, జనగామ, నిర్మల్ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థికశాఖ ఉత్తర్వుల నేపథ్యంలో ‘‘ఆరోగ్య తెలంగాణ దిశగా మరో ముందడుగు పడింది’’ అని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌ రావు ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఏర్పాటైన 8 కొత్త మెడికల్ కాలేజీలకు గతేడాదే ఆర్థికశాఖ పోస్టులు మంజూరు చేసింది. వాటి భర్తీకి ఈ ఏడాది మార్చిలో ఆమోదం తెలిపింది. కానీ వాటిని ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. పాత కాలేజీల్లోని ఖాళీలను సైతం నింపలేదు. 

కాంట్రాక్టు పద్ధతిలో 184 పోస్టులకు..

ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో రెగ్యులర్ బేసిస్‌‌‌‌‌‌‌‌పై రిక్రూట్‌‌‌‌‌‌‌‌మెంట్ చేయకపోవడం వల్ల టీచింగ్ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో 81 ప్రొఫెసర్, 103 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ కొత్త గైడ్‌‌‌‌‌‌‌‌లైన్స్ ప్రకారం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని మెడికల్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూలకు అటెండ్ కావాలని నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ఇంటర్వ్యూకు వచ్చేటప్పుడు ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తదితర సర్టిఫికెట్లను తీసుకురావాలని సూచించింది. ఈ నెల 12న మెరిట్ లిస్టు విడుదల చేస్తామని, ఈ నెల 19లోపు ఉద్యోగంలో జాయిన్ అవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఇతర రాష్ట్రాలకు చెందిన డాక్టర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని, లోకల్ వాళ్లు లేకుంటే ఇతర రాష్ట్రాల వాళ్లను కూడా ఎంపిక చేస్తామని ప్రకటించింది. అఫ్లికేషన్ ఫామ్, ఇతర వివరాలకు dme.telangana.gov.in వెబ్ సైట్ చూడాలని