రీసెర్చ్ స్కాలర్లకు నెట్ ఫెలోషిప్ రూ.30 వేలు ఇవ్వాలి

 రీసెర్చ్ స్కాలర్లకు నెట్ ఫెలోషిప్ రూ.30 వేలు ఇవ్వాలి

ఓయూ, వెలుగు :   రీసెర్చ్ స్కాలర్లకు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెలోషిప్ రూ.30 వేలు ఇవ్వాలని, స్టూడెంట్లకు ఆర్థిక భారంగా మారిన మెస్​ బిల్లులను రద్దు చేయాలని తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జేఏసీ స్టేట్ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ ప్రభుత్వాన్ని కోరారు. 

 డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఓయూ పర్యటన రద్దు కావడంతో స్టూడెంట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్​ ప్రొఫెసర్ ​లింబాద్రికి వినతిపత్రం అందజేశారు.  సమస్యను ప్రభుత్వం దృష్టికి  తీసుకువెళ్లి స్టూడెంట్లకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు.  కార్యక్రమంలో రీసెర్చ్ స్కాలర్లు ఎడెల్లి రవి, శ్రీను, పోతురాజు రాము, సునీల్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.