మత్స్యకార సొసైటీలకు చేప పిల్లల బదులు డబ్బులు ఇస్తాం

మత్స్యకార సొసైటీలకు చేప పిల్లల బదులు డబ్బులు ఇస్తాం
  • వచ్చే ఏడాది నుంచి ఈ విధానం ప్రారంభం
  • రాబోయే రోజుల్లో మొబైల్ ఫిష్ ఔట్ లెట్లు మంజూరు చేస్తాం
  • ఆర్ధిక మంత్రి హరీష్ రావు

కరీంనగర్: మత్స్యకార సొసైటీలకు చేప పిల్లల బదులు డబ్బులు ఇచ్చే కార్యక్రమం వచ్చే ఏడాది నుంచి ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అలాగే రాబోయే రోజుల్లో మొబైల్ ఫిష్ ఔట్ లెట్లు మంజూరు చేస్తామని ఆయన తెలిపారు. వీణవంక మండలం దేశయిపల్లి లో పిఎస్ కే గార్డెన్ లో  ముదిరాజ్  కులస్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ముదిరాజ్ ల కోసం కేసీఆర్ 1000 కోట్లు ఫండ్ ఏర్పాటు చేశారని, 60వేల మంది మత్స కారులకు  మోటార్ సైకిల్లు ఇచ్చామని, అలాగే  150 కోట్ల రూపాయలతో లగేజ్ వాహనాలను అందించామని ఆయన గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మొబైల్ ఫిష్ ఔట్ లెట్ లు మంజూరు చేస్తామని,  ఇప్పటికే 75 కోట్లతో 7,590 మత్సకారుల  భవనాలకు మంజూరు చేసామని ఆయన వెల్లడించారు.  
రేపటి నుంచి చేప పిల్లలు వేసే కార్యక్రమం ఇక్కడ ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. 609 జీవో  అమలు , కొత్త సభ్యత్వాలకు త్వరలోనే ఏర్పాటు చేస్తామని,  గ్రామాలలో చెరువులు, కుంటలు అయినా మత్స్యకారులకు కల్పించే విధంగా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. హుజురాబాద్ లోని అన్ని మండల కేంద్రాలలో అధునాతన చేపల మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. బీజీపీ ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.  పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు పెంచిన బీజెపి కా .. లేక కళ్యాణ లక్ష్మి ,షాద్ ముబారక్ ఇచ్చిన టీఆరెస్  కా ఆలోచించుకోవాలని సూచించారు. డొడ్డు వడ్లు కొంటామని ఢిల్లీకి వెళ్లి ఒప్పించి ఓట్లు అడగాలన్నారు.  తెలంగాణ కోసం కొట్లాడిన  గెల్లు శీను మీద130 కేసులు ఉన్నాయని, పేద బిడ్డ గెల్లు శీనుకు టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆశీర్వాద ఉందన్నారు. ఈనుకు ఆస్తులు లేవు కానీ పని చేసే సంకల్పం ఉందన్నారు.  మత్స్యకారుల మీటింగుకు పోకపోతే 20,000 ఇస్తామని బీజేపీ వాళ్లు ఫోన్ చేస్తున్నారట,  కేసీఆర్ ఉచితంగా మత్స్యకారులకు మోటార్ మోటార్ సైకిళ్ళు ఇచ్చారు, బీజేపీ వాళ్లు ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు లీటర్ల పెట్రోలు ఉచితంగా అందించాలని సూచించారు.  కొంత మంది బీజేపీ వాళ్లు వచ్చి సేంటి మెంట్ తో ఓట్లు పొందాలని చేస్తున్నారు.. ఆలోచించాలని కోరారు. ధరలు పెంచిన బిజెపి పార్టీ వైపా లేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ వైపా ఆలోచించుకోవాలని మంత్రి హరీష్ రావు కోరారు.