కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్

 కానిస్టేబుల్ నియామకాలకు హైకోర్టు బ్రేక్

తెలంగాణలో కానిస్టేబుల్‌ నియామకాలకు  హైకోర్టు  బ్రేక్ వేసింది. మెయిన్స్ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి..తిరిగి మూల్యాంకనం చేయాలని TSLPRBను హైకోర్టు ఆదేశించింది. అందరు అభ్యర్థులకు 4 మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలని సూచించింది.  ఆ తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును ఆదేశించింది.  కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలోని 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని.. 57 ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలని హైకోర్టు TSLPRBను   ఆదేశించింది.

   ఆగస్టు 30 2023 న దాదాపు 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. తుది ఫలితాలను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అక్టోబర్ 4వ తేదీన  ప్రకటించింది. 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపిక చేసింది. అయితే  తాజా హైకోర్టు తీర్పుతో మళ్లీ ఫలితాలు వెల్లడించనుంది.