అక్టోబరు 8 నుంచి కౌన్సెలింగ్

అక్టోబరు 8 నుంచి కౌన్సెలింగ్

హైదరాబాద్, వెలుగు : టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజయ్యింది. అక్టోబరు 8 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నట్లు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ లింబాద్రి తెలిపారు. రెండు విడతల్లో కౌన్సెలింగ్ ఉంటుంద న్నారు. ఫస్ట్ ఫేజ్-లో వచ్చే నెల 8 నుంచి 12 వరకు ఆన్​లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల వెరిఫికేషన్-కు స్లాట్ బుకింగ్ ఉంటుంది.

సీట్ల అలాట్మెంట్ అక్టోబర్ 18న ఉండగా.. 21లోపు ఆన్​లైన్ ​సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అక్టోబర్ 23న ప్రారంభమవుతుంది. 24న సర్టిఫికేట్ల వెరిఫికేషన్, 23 నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. అక్టోబర్ 28న సీట్ల అలాట్మెంట్ ఉంటుంది. 30 లోపు ఆన్​లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్.. 31 లోపు కాలేజీల్లో రిపోర్టు చేయాలని అధికారులు సూచించారు.