2022 – 23 అకడమిక్ క్యాలెండర్ విడుదల

2022 – 23 అకడమిక్ క్యాలెండర్ విడుదల

2022 – 23 విద్యా సంవత్సరం క్యాలెండర్ విడుదలైంది. బుధవారం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ విడుద‌ల చేసింది. ఈ విద్యా సంవ‌త్సరంలో ఒక‌టి నుంచి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు మొత్తం 230 ప‌ని దినాలు ఉంటాయ‌ని ప్రకటించింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. సమ్మర్ వెకేష‌న్ ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వ‌ర‌కు ఉండనున్నాయని వెల్లడించింది. మొద‌టి ఎఫ్ఏ (formative assessment) జూలై 21 లోపు, ఎఫ్ఏ – 2 ప‌రీక్షలు సెప్టెంబ‌ర్ 5 లోపు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేష‌న్ సూచించింది. ఇక ఎస్ఏ – 1 (summative assessment) ప‌రీక్షలు న‌వంబ‌ర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వ‌ర‌కు నిర్వహించనున్నారు.

ఎఫ్ఏ – 3 ఎగ్జామ్స్ డిసెంబ‌ర్ 21 లోపు, ఎఫ్ఏ – 4 ఎగ్జామ్స్ ను 10వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు జ‌న‌వ‌రి 31 లోపు, 1 నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ఫిబ్రవరి 28 లోపు నిర్వహిస్తారు. 1  నుంచి 9 త‌ర‌గతుల‌కు ఎస్ఏ-2 ప‌రీక్షలను ఏప్రిల్ 10 నుంచి 17 వ‌ర‌కు నిర్వహిస్తామని స్కూల్ ఎడ్యుకేష‌న్ ప్రకటించింది. ఫిబ్రవరి 28 లోపు టెన్త్ స్టూడెంట్స్‌కు ప్రీ ఫైన‌ల్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. ఎస్సెస్సీ బోర్డు (SSC Board) ఎగ్జామ్స్ మార్చి నెల‌లో నిర్వహిస్తారు.

పండుగ‌ల సెల‌వులు :-

  • ద‌స‌రా సెల‌వులు – అక్టోబ‌ర్ 26 నుంచి న‌వంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు (14 రోజులు).
  • క్రిస్మస్ సెల‌వులు – డిసెంబ‌ర్ 22 నుంచి 28 వ‌ర‌కు (7 రోజులు).
  • సంక్రాంతి సెల‌వులు – జ‌న‌వ‌రి 13 నుంచి 17 వ‌ర‌కు (5 రోజులు).