
తెలంగాణ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ లో కౌన్సెలింగ్ ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ కోసం నమోదుకు చివరి తేది నవంబర్ 21, వెబ్ సైట్.. lawcetadm.tsche.ac.in
TS LAWCET 2023 కౌన్సెలింగ్ ఎలా నమోదు చేసుకోవాలి
1. TS LAWCET అధికారిక వెబ్ సైట్ lawcetadm.tsche.ac.inను సందర్శించాలి.
2.హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న కౌన్సెలింగ్ లింక్ పై క్లిక్ చేయాలి.
3. కొత్త రిజిస్ట్రేషన్ కోసం లింక్ యాక్సెస్ చేయాలి. దరఖాస్తు ఫారమ్ ను నింపాలి
4. అవసరమైన సర్టిఫికెట్లు, నిర్దేశించిన సైజులలో, పరిమాణంలో అప్ లోడ్ చేయాలి.
5.నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిల్ డబ్బులు చెల్లించాలి.
6.సబ్మిట్ బన్ నొక్కి, TS LAWCET కౌన్సెలింగ్ సమర్పించిన దరఖాస్తు పారమ్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
7. భవిష్యత్ అవసరాల కోసం డౌన్ లోడ్ చేసిన ఫారమ్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
ALSO READ : ఏపీ వర్సిటీల్లో 3,220 ఉద్యోగాలు
ఈ ఏడాది మొత్తం 43వేల 692 మంది అభ్యర్థులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు. ఇందులో 36వేల 218 మంది అభ్యర్థులు పరీక్షలో పాల్గొనగా.. 29వేల 049 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మే 25న రాష్ట్రవ్యాప్తంగా 202 ప్రాంతాల్లో రాత పరీక్షను నిర్వహించారు. TS LAWCET 2023 కి అర్హత సాధించాలంటే, జనరల్ కేటగిరి దరఖాస్తుదారులు తప్పనిసరిగా 120 మార్కులలో కనీసం 42 మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని విద్యార్థులకు కనీస అర్హత గ్రేడ్ అవసరం లేదు.