కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుంది

కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుంది

మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ధాన్యం నిల్వ కోసం  సరైన స్టోరేజీ వసతి లేకపోవడం, నెల రోజులుగా మిల్లింగ్ మూతపడడంతో వర్కర్స్ తరలిపోతున్నారని తెలిపారు. కొన్ని చోట్ల ఆరుబయట ఉంచిన ధాన్యం తడిసిపోతోందని మంత్రికి నివేదించారు. సావధానంగా విన్న మంత్రి గంగుల కమలాకర్.. ఈ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హమీ ఇచ్చారు. మిల్లింగ్ సమస్యలపై ప్రభుత్వం నిరంతరం చర్చిస్తోందని తెలిపారు. రాష్ట్ర రైతాంగంతో ముడిపడి ఉన్న ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నుంచి  కూడా సానుకూల స్పందన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.