రేపు టీఎస్ పీఈసెట్ ఫలితాలు విడుదల

రేపు టీఎస్ పీఈసెట్ ఫలితాలు విడుదల

హైదరాబాద్: టీఎస్ పీఈసెట్-2022 ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు. రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి చేతుల మీదుగా ఫలితాలు విడుదల కానున్నట్లు తెలిపారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(యూజీడీపీఈడీ), బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఈడీ) కోర్సుల్లో ప్రవేశానికి నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా ఫిజికల్‌ ఈవెంట్స్‌ పరీక్షలు జరిగాయి.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 6 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షలకు 3,659 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. మొత్తం 2,340 మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.