పాలిసెట్​కు దరఖాస్తు గడువు పెంపు

పాలిసెట్​కు దరఖాస్తు గడువు పెంపు
  • లక్షకు చేరువలో అప్లికేషన్లు

హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్, ఆర్జీయూకేటీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహిస్తున్న పాలిసెట్ కు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. శనివారం సాయంత్రం నాటికి 97,315 దరఖాస్తులు వచ్చాయి. కాగా దరఖాస్తు గడువు శనివారంతో ముగియగా, మరో రెండ్రోజులు పెంచినట్టు పాలిసెట్ కన్వీనర్ శ్రీనాథ్ తెలిపారు. ఫైన్ లేకుండా 6వ తేదీ వరకూ, రూ.వంద ఫైన్​తో ఈ నెల 7 వరకు గడువు పెంచామని చెప్పారు. జూన్ 30న  పాలిసెట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.