ఇవాళ్టి నుంచి టెన్త్ స్పాట్ వాల్యుయేషన్

ఇవాళ్టి నుంచి టెన్త్ స్పాట్ వాల్యుయేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ మొదలు కానున్నది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 3 నుంచి 19 కేంద్రాల్లో వాల్యుయేషన్ ప్రారంభమవుతోంది. దీంట్లో మొత్తం 16వేల మంది టీచర్లు, సిబ్బంది అటెండ్ కానున్నారు.

ఈ నెల 11 వరకూ వాల్యుయేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. ఒక టీచర్ ద్వారా ప్రతి రోజూ 40 పేపర్లు దిద్దించనున్నారు. మొత్తంగా 36 లక్షల ఆన్సర్ షీట్లను వాల్యుయేషన్ చేయనున్నారు. ఏప్రిల్ నాల్గో వారంలోనే ఫలితాలు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.