TS Tenth Exams 2024: పదోతరగతి పరీక్షలు.. సెల్ ఫోన్లు తీసుకెళ్తే సస్పెన్షనే..

TS Tenth Exams 2024: పదోతరగతి పరీక్షలు.. సెల్ ఫోన్లు తీసుకెళ్తే సస్పెన్షనే..

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ ఫోన్ వినియోగంపై విద్యా శాఖ కఠిన ఆంక్షలు విధించింది. 2024 మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. అయితే ఈ సమయంలో పరీక్షలు జరిగే కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్ గా SSC బోర్డు ప్రకటించింది.

పరీక్ష సిబ్బంది... స్క్వాడ్స్ తో సహా ఎవరూ కూడా సెల్ ఫోన్ వాడటం నిషేదమని ఆదేశాలు జారీ చేసిది. రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలతో పాటు.. సస్పెండ్ చేస్తామని హెచ్చరించింది. గత ఏడాది జరిగిన సంఘటనల దృష్ట్యా విద్యా శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

కాగా మార్చి 18వ తేదీ నుంచి తెలంగాణ పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.  SSC హాల్​ టికెట్లు వెబ్ సైట్​ నుంచి ఎలా డౌన్​ లోడ్​ చేసుకోవాలో తెలుసుకుందాం. . . .

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 18వ తేదీన ప్రారంభమై...ఏప్రిల్ 2వ తేదీతో ముగియనున్నాయి.  పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కూడా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 18వ తేదీనే ఇంటర్ పరీక్షలు(Telangana Inter Exams 2024) కూడా ముగియనున్నాయి. అయితే పదో తరగతి పరీక్షలకు టైం దగ్గరపడుతున్న వేళ హాల్ టికెట్లకు సంబంధించి కీలక అప్డేట్ అందింది. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల 676 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇలా డౌన్లోడ్ చేసుకోండి

  • పదో తరగతి పరీక్ష రాసే విద్యార్థులు మొదటగా https://bse.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • SSC Examinsation March -2024 అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ వివరాలను ఎంట్రీ నమోదు చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
  • మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే అప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.