డిమాండ్​కు తగ్గట్టుగా బీర్లు సప్లై చేయండి: ఎక్సైజ్​శాఖకు వైన్స్​ ఓనర్ల వినతి

డిమాండ్​కు తగ్గట్టుగా బీర్లు సప్లై చేయండి: ఎక్సైజ్​శాఖకు వైన్స్​ ఓనర్ల వినతి

హైదరాబాద్, వెలుగు: బీర్లు సరిపడ స్థాయిలో సప్లై చేయాలంటూ ఎక్సైజ్ శాఖకు వైన్​షాప్ ల​ఓనర్లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఆ శాఖ కమిషనర్ ను కలిసేందుకు వైన్స్ షాప్ ల ఓనర్లు నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి వచ్చారు. కమిషనర్​ అందుబాటులో లేకపోవడంతో ఆఫీస్ లో వినతి పత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

ప్రతి రోజూ ఒక్కో వైన్స్ లో కనీసం 1200  నుంచి 1500 బీర్లు సేల్ చేస్తామని.. కానీ, ఎక్సైజ్ డిపో నుంచి కేవలం 200 నుంచి 240 బీర్లు మాత్రమే వస్తున్నాయని తెలిపారు హైదరాబాద్ లో ఏడాదిలో ఒక్కో వైన్స్ షాప్ కు కోటి 10 లక్షల లైసెన్స్ ఫీజు కడుతున్నామని పేర్కొన్నారు. అన్ని ఖర్చులు కలిపి నెలకు యావరేజ్ గా సుమారు రూ.18 లక్షలు ఎక్సైజ్ శాఖకు ఈఎంఐగా చెల్లిస్తున్నామని వెల్లడించారు. అయినప్పటికీ, డిమాండ్ కు అనుగుణంగా ఎక్సైజ్ శాఖ బీర్లు సప్లై చేయడం లేదన్నారు.