హైదరాబాద్, వెలుగు: టీసాట్లో ఈ నెల12 నుంచి మే 2వరకు ఎప్ సెట్ కోచింగ్ క్లాసులు నిర్వహిస్తామని టీసాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.112 రోజుల పాటు 450 చాప్టర్స్‌పై శిక్షణనిస్తామని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్ పూర్తి చేసి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ వంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం సన్నద్ధమవుతున్న విద్యార్థులకు టీసాట్విద్య చానెల్లో ఉదయం 7 గంటలకు, నిపుణ చానెల్లో సాయంత్రం 7 గంటలకు క్లాసులను ప్రసారం చేస్తామని వివరించారు.
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టులపై క్లాసులు ఉంటాయని చెప్పారు. పేద, మారుమూల ప్రాంతాల విద్యార్థులతోపాటు అందరికీ నాణ్యమైన డిజిటల్కంటెంట్ను అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రసారాలు శాటిలైట్ చానెళ్లతో పాటు టీసాట్ యాప్, యూట్యూబ్ లోను అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.
