
టీఎస్పీఎస్సీ సీడీపీవో, ఈవో పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. టీఎస్పీఎస్సీ సీడీపీవో, ఈవో ఎగ్జామ్స్ ను క్యాన్సిల్ చేయాలని కోరుతూ 76 మంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు విచారించింది. అయితే విచారణ నేపథ్యంలో వాదనల కోసం పిటిషనర్లు సమయం కావాలని కోరారు. సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ ఏప్రిల్ 11వ తేదీన తమ తరపున వాదనలు వినిపిస్తారని పిటిషనర్లు తెలిపారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది.
TSPSC సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ పరీక్షలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ 76 మంది అభ్యర్థులు పిటిషన్లు వేశారు. సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ పేపర్లపై కూడా దర్యాప్తు చేయాలని పిటిషన్‌లో కోరారు. జనవరిలో సీడీపీవో, గ్రేడ్ 1 సూపర్‌వైజర్ నియామక పరీక్షలు TSPSC నిర్వహించిందని..అయితే తాము వేసిన పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు.