TSPSC : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు..ఆందోళనలో 2 లక్షల 30 వేల మంది స్టూడెంట్స్

TSPSC : గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు..ఆందోళనలో 2 లక్షల 30 వేల మంది స్టూడెంట్స్

తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి అత్యంత దారుణంగా..దయనీయంగా మారింది. ఏ పరీక్ష  రాసినా..ఫలితాలు వెల్లడవుతాయని కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రాసిన పరీక్షలు ఎప్పుడు రద్దు అవుతాయో చెప్పలేని పరిస్థితి. దీనికి కారణం పరీక్షల నిర్వహణలో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం. 

తాజాగా గ్రూప్ 1  ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దయింది. 2022లో తొలిసారిగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను అక్టోబర్ 16వ తేదీన నిర్వహించారు. ఫలితాలు కూడా విడుదలయ్యాయి. మెయిన్స్ నిర్వహణకు సిద్ధం అవుతున్న సమయంలో పేపర్ లీకేజీ బాగోతం బయటపడడంతో ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ALSO READ : పోలీస్ అలర్ట్ : గణేష్ నిమజ్జనం రోజు పాటించాల్సిన నిబంధనలు

ఆ తర్వాత 2023 జూన్ 11వ తేదీన మరోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ పరీక్షకు 2,33,248 మంది TSPSC Group 1 ప్రిలిమ్స్ పరీక్ష రాశారు.  ఈ పరీక్ష నిర్వహించి మూడు నెలలు దాటినా ఇంత వరకు ఫలితాలు మాత్రం విడుదల చేయలేదు. ప్రాథమిక కీ మాత్రమే విడుదల చేశారు. నవంబర్ లో గ్రూప్ 1 మెయిన్ కు అభ్యర్థులు సిద్దమవుతున్నారు. కానీ మరోసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. దీంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన 2 లక్షల 33 వేల మంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 

తెలంగాణలో నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. జూన్ 11 న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయకపోటవంపై పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటీషన్ పై విచారించిన హైకోర్టు..గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది.