
టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలైంది. వెటర్నరీ, హార్టీకల్చర్ డిపార్ట్మెంట్లలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయనుంది. హార్టికల్చర్ విభాగంలో 22 ఆఫీసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. హార్టికల్చర్ పోస్టులకు జనవరి 3 నుంచి 24 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. టీఎస్పీఎస్సీ ఇప్పటికే పలు నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది.