జూనియర్ లెక్చరర్ల పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

జూనియర్ లెక్చరర్ల పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

టీఎస్పీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది.1392  జూనియర్ లెక్చరర్ల పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారిగా జేఎల్ పోస్టులకు నోటఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. జున్ లేదా జూలైలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది.

చివరిసారి 2008లో జేఎల్ నోటిఫికేషన్‌ రిలీజైంది. అయితే పలు సంఘటనల తర్వాత 2012లో ఈ పోస్టులను భర్తీ చేశారు. తెలంగాణ ప్రాంతంలో సుమారు 457 జేఎల్‌ పోస్టులను అప్పట్లో భర్తీ చేశారు. ఆ తర్వాత మళ్లీ జేఎల్‌ పోస్టుల భర్తీ జరగలేదు. ఈ నేపథ్యంలో జేఎల్‌ పోస్టుల కోసం ఈసారి అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీపడే అవకాశం ఉంది.