
టీఎస్పీఎస్సీ నుంచి మరో రెండు నోటిఫికేషన్లు రిలీజయ్యాయి. విద్యాశాఖలో 128 ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. సాంకేతిక విద్యాశాఖలో 37, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనుంది. జనవరి 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వివరించింది.
వ్యవసాయశాఖలో 148 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్పీ నోటిఫికేషన్ ఇచ్చింది. మల్టీజోన్-1 లో 100 పోస్టులు, మల్టీజోన్-2లో 48 పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 10వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు పేర్కొంది.పూర్తి వివరాలకు వెబ్‌సైట్ tspsc.gov.inలో సంప్రదించాలని సూచించింది.