
రాష్ట్రంలోని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా డిసెంబర్ 16 నుంచి జనవరి 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల్లో 5 ఉద్యోగాలు మల్టీ జోన్ -1 పరిధిలో ఉన్నాయి. మల్టీ జోన్ 2 పరిధిలో 13 పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఫార్మసీలో డిగ్రీ, ఫార్మాస్యూటికల్ సైన్స్, డిఫార్మసి, మెడిసిన్‌లో క్లినికల్ ఫార్మకాలజీ డిగ్రీ, మైక్రో బయాలజీలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 2022 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంది. మే లేదా జూన్ నెలల్లో రాత పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
దరఖాస్తులు: డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.200 రుపాయలు ప్రాసెసింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్షను హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.