TSPSC పేపర్ లీక్ కేసు.. ఏప్రిల్ 28న హైకోర్టు తుది తీర్పు

TSPSC పేపర్ లీక్ కేసు.. ఏప్రిల్ 28న హైకోర్టు తుది తీర్పు

టీఎస్ పీఎస్ సీ(TSPSC) పేపర్ లీక్ పై  28న హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.  టీఎస్ పీఎస్ సీ కేసును సీబీఐకి అప్పగించాలన్నా కాంగ్రెస్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కాంగ్రెస్ తరపున లాయర్ వివేక్ ధన్కడ్ వాదనలువినిపించారు. అయితే ఈ పిటిషన్ ను ఇంత హడావుడిగా విచారించాల్సిన అవసరం లేదన్నారు అడ్వొకేట్ జనరల్. అంతేగాకుండా ఈ కేసులో ఇంకా ఎస్ఎఫ్ఎల్ నివేదిక రావాల్సి ఉందన్నారు ఏజీ. సిట్ దర్యాప్తు జరుపుతోందని, విచారణ కొనసాగుతోందని ఏజీ కోర్టుకు తెలిపారు.

ఇప్పటికే సిట్ నివేదిక సమర్పించామని..అడిషనల్ నివేదిక సబ్మిట్ చేస్తామని కోర్టుకు చెప్పారు ఏజీ. ఇప్పటికిప్పుడు విచారణ అవసరం లేదని కోర్టుకు తెలిపారు ఏజీ. అయితే తమ వాదనలు వినాలని  పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. సుప్రీం కోర్టు తీర్పును చదివి వినిపించారు వివేక్ ధన్కా. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఏప్రిల్ 28కి వాయిదా వేసింది కోర్టు.

సిట్ తూతూ మంత్రంగా విచారణ చేస్తోందన్న పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.  టీఎస్పీఎస్సీకి మంత్రి కేటీఆర్ క్లీన్ చీట్ ఇచ్చారని.. సిట్ దర్యాప్తు వివరాలు మంత్రికి ఎవరిచ్చారని పిటిషనర్ న్యాయవాది ప్రశ్నించారు.  టీఎస్ పీస్ లోని ఏడుగురు  సభ్యుల నియామంకం పూర్తిగా విరుద్ధమని  కోర్టుకు తెలిపారు..

https://www.youtube.com/watch?v=hedPkMYLRZM