టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో.. మరో ఇద్దరికి బెయిల్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో.. మరో ఇద్దరికి బెయిల్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరికి బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న తండ్రి కొడుకులు మైబయ్య, జనార్ధన్ లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 

టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీకేజీ కేసులో మైబయ్య జనార్థన్ లను సిట్ అధికారులు ఏప్రిల్ 21న అరెస్ట్ చేశారు. డాక్య నాయక్ అనే వ్యక్తి నుంచి మైబయ్య తన కుమారుడు జనార్థన్ కోసం రూ.  2 లక్షలకు ఏఈ ప్రశ్న పత్రాన్ని  కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు తేల్చారు. 

ఈ కేసులో తాజాగా మైబయ్య అతని కొడుకు జనార్థన్ లకు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పటి  వరకు ఈ కేసులో బెయిల్ పొందిన వారి సంఖ్య 17కు చేరింది.