న్యూడ్ కాల్స్‌‌ కోసం పేపర్స్‌‌ లీక్‌‌ చేశాడా..?

న్యూడ్ కాల్స్‌‌ కోసం పేపర్స్‌‌ లీక్‌‌ చేశాడా..?

హైదరాబాద్‌‌, వెలుగు: టీఎస్‌‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు ప్రధాన నిందితుడు ప్రవీణ్‌‌ క్రైమ్ హిస్టరీ బయటపడుతోంది. అతడి మొబైల్‌‌లో 48 మంది యువతుల న్యూడ్ వీడియో కాల్స్‌‌ ఉన్నట్లు తెలిసింది. వాటి స్ర్కీన్ షాట్స్‌‌, వీడియోలు డౌన్‌‌లోడ్‌‌ చేసుకున్నట్లు సమాచారం. ఈ వీడియోస్‌‌లో ఉన్న యువతులు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పేపర్ లీకేజీల్లో ఈ యువతులకు ఏమైనా ప్రమేయం ఉందా? అనే వివరాలు రాబడుతున్నారు. ఇందులో రేణుక పాత్రపైనా వివరాలు సేకరిస్తున్నారు. రేణుక సెలక్షన్‌‌పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2017లో ప్రవీణ్‌‌ జాయిన్ అయిన తర్వాత ఆమె ఎన్నిసార్లు టీఎస్‌‌పీఎస్సీ ఆఫీస్‌‌కు వచ్చిందనే వివరాలు తెలుసుకుంటున్నారు. 2018లో ఆమె గురుకుల హిందీ పండిట్‌‌గా సెలెక్ట్ కావడానికి ప్రవీణ్ సహకరించాడా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. కాగా, వనపర్తి జిల్లా బుద్ధారం ఎస్సీ గురుకుల స్కూల్‌‌లో హిందీ టీచర్‌‌‌‌గా పనిచేస్తున్న రేణుక క్రైమ్​ హిస్టరీపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏఈ పేపర్‌‌ లీకేజీ కోసం మూడు నెలల్లో 12 సెలవులు పెట్టినట్టుగా భావిస్తున్నారు. ఏఈ పరీక్షకు ముందు రెండ్రోజులు సెలవు పెట్టిన ఆమె బంధువు చనిపోయారని కారణం చెప్పింది. ఈ రెండు రోజులు లీకైన పేపర్లు ఇచ్చి నీలేశ్​, గోపాల్‌‌తో ప్రాక్టీస్​ చేయించిందని, భర్తతో కలిసి వారిని తీసుకెళ్లి పరీక్ష రాయించిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, రేణుకపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గురుకుల సెక్రటరీ రోనాల్డ్ రాస్​కు బుద్ధారం గురుకుల ప్రిన్సిపాల్ లెటర్‌‌‌‌ రాశారు.

టీఎస్ పీఎస్సీలో సిట్​ దర్యాప్తు

మరోవైపు ఈ కేసులో స్పెషల్‌‌ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌(సిట్), సైబర్​ క్రైమ్​ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సిట్‌‌ చీఫ్‌‌ ఏఆర్ శ్రీనివాస్‌‌ టీమ్ బుధవారం టీఎస్‌‌పీఎస్సీ ఆఫీసులో దర్యాప్తు జరిపింది. కార్యాయల సిబ్బందిని విచారించింది. డైనమిక్ ఐపీకి బదులుగా స్టాటిక్ ఐపీ క్రియేట్ చేసిన ల్యాన్‌‌ను పరిశీలించింది. సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మీ నుంచి సమాచారం సేకరించింది. కాన్ఫిడెన్షియల్‌‌ ఫోల్డర్‌‌‌‌లో ఎన్ని పేపర్స్‌‌ ఉన్నాయి.. ప్రవీణ్‌‌ ఎన్ని డౌన్‌‌లోడ్‌‌ చేసుకున్నాడనే వివరాలు తెలుసుకుంటున్నారు. పేపర్ లీక్  చేయడంలో రాజశేఖర్‌‌ కీలకంగా వ్యవహరించినట్లు గుర్తించారు. అసిస్టెంట్‌‌ ఇంజనీర్‌‌(ఏఈ), టౌన్‌‌ ప్లానింగ్‌‌ బిల్డింగ్‌‌ ఓవర్సిర్ పేపర్లు లీక్ అయినట్లు తేల్చారు.