టీఎస్పీఎస్సీ ముందు ఉద్రిక్తత.. పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్

టీఎస్పీఎస్సీ ముందు ఉద్రిక్తత.. పీఈటీ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్

హైదరాబాద్ టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని గురుకుల పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ముట్టడించారు. 2017లో విడుదలై గురుకుల పీఈటీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. కమిషన్ ఆఫీసుకు భారీగా చేరుకున్న పీఈటీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి అబిడ్స్, నాంపల్లి పోలీస్ స్టేషన్లకు తరలించారు. 
  
2017లో విడుదల చేసిన గురుకుల పీఈటీ పోస్టులు ఇప్పటి వరకు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని అభ్యర్థులు మండిపడ్డారు. 616 పోస్టులకుగానూ 1:2 నిష్పత్తి ప్రాతిపదికన 1232 మంది అభ్యర్థులను గతంలో ఎంపిక చేశారని తెలిపారు. కానీ ఇంత వరకు వీటి వివరాలను వెబ్​సైట్​లో పెట్టలేదన్నారు. కోర్ట్ కేసులతో వాయిదా వేస్తూ...ఆరేళ్లుగా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కోర్టు కేసు పూర్తి అయినప్పటికీ.. టీఎస్పీఎస్సీ స్పందించటం లేదని అభ్యర్థులు వాపోయారు. వెంటనే 616 పోస్ట్ లను భర్తీ చేయాలన్నారు. తమకు సాయంత్రం వరకు పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే గాంధీ భవన్లో బైఠాయించారు.