TSPSC: టీపీబీవో ప‌రీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథ‌మిక కీ రిలీజ్

TSPSC:  టీపీబీవో ప‌రీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథ‌మిక కీ రిలీజ్

టీఎస్పీఎస్సీ  టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ‌ర్సీస్ ప‌రీక్ష రెస్పాన్స్ షీట్లు, ప్రాథ‌మిక కీ విడుదలైంది. జులై 13వ తేదీ నుంచి జులై 15 వరకు  ప్రాథ‌మిక కీపై  అభ్యంత‌రాల‌ను స్వీక‌రించ‌నున్నారు. ప‌రీక్ష రెస్పాన్స్ షీట్లు ఆగస్టు 11వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి.  మరిన్ని వివ‌రాల కోసం టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించొచ్చు. ఈ నెల 8వ తేదీన టీపీబీవో రాత‌ప‌రీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే.

జులై  8వ తేదీన టౌన్‌ ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీస్‌ (టీపీబీవో) రాత‌ప‌రీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించింది.  ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష జరిగింది.  కంప్యూటర్‌ బేస్డ్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (సీబీఆర్‌టీ) పద్ధతిలో నిర్వహించారు. 

ALSOREAD:ఐటీ ఉద్యోగులకు మరో గండం ముంచుకొస్తోంది

తెలంగాణ మున్సిపల్ శాఖలో 175 టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ఉద్యోగాల భర్తీకి 2022 సెప్టెంబరు 7న టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 20 నుంచి అక్టోబరు 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించారు. మొదట జనవరిలోనే రాతపరీక్ష నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. కుదరకపోవడంతో మార్చి 12న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్ష జులై8కు  వాయిదాపడింది. ఈ  ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.32,810 - రూ.96,890 జీతంగా ఇస్తారు.