
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలో ధర్మవరం స్టేజ్ దగ్గర బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులో మొత్తం 49 ప్రయాణికులు ఉన్నారు. బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొని పల్టీ కొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. కొంత మందిని కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్ కు మూడు 108 అంబులెన్స్ ల్లో తరలించారు. అంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారని అలంపూర్ సీఐ తెలిపారు. డ్రైవర్ నిర్లక్షంగా డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు పోలీసులు.