త్వరలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

త్వరలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనర్..  ఆర్టీసీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎప్పుడో 20వ తేదీన వచ్చే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు సజ్జనార్ చేరాక ఫస్ట్ కే జీతాలు పడుతున్నాయి. తాజాగా ఆయన ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ... ఎక్కడికక్కడ తనిఖీలు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఓ షాకింగ్ వార్త చెప్పారు. త్వరలో బస్సు ఛార్జీలు పెరుగుతాయని బాంబు పేల్చారు సజ్జనార్. డీజిల్ ధరలు పెరగడంతో బస్ ఛార్జీలు కూడా పెంచే ఆలోచన ఉందన్నారు. క్యాట్ కార్డు తరహాలో కొత్త పథకాలు కూడా అమలు చేస్తామన్నారు. వివాహ, వన భోజనాలు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేటప్పుడు, రైతులకు ధాన్యం తరలింపు వంటి సేవల కోసం ఆర్టీసీ బస్సుల్ని ఉపయోగించుకోవాలన్నారు. దీని కోసం అడ్వాన్స్ చెల్లింపులు ఉండవన్నారు సజ్జనార్. 

బస్సు సౌకర్యం కోసం తనకు ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే పంపిస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. బస్టాండ్ లో ప్రజల భద్రత కోసం రాజకీయ పార్టీలు ఆర్గనైజేషన్ ల తో సంప్రదించి సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తామన్నారు సజ్జనార్. రాజకీయ పార్టీలు ఇతర సంస్థల వారు బస్టాండ్ లో పోస్టరు వేస్తే కేసులు పెడతామని హెచ్చరించారు. ఇప్పటికే వరంగల్,  హైదరాబాద్ లో కేసులు నమోదు చేశామన్నారు. ఆర్టీసీ ఆదాయం కోసం 49 వేల సిబ్బంది బాగా పని చేస్తున్నారని కొనియాడారు. కార్గో సేవలు కూడా బాగున్నాయన్నారు. బస్టాండ్లో ఎమ్మార్పీ ధరలకు మించి వస్తువులు అమ్మ రాదని దుకాణదారులను సజ్జనార్ హెచ్చరించారు. సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను  ఆదరించాలన్నారు.  నార్కట్ పలి ప్రయాణికుల వస్తువుల చోరీ మీడియా ద్వారానే తనకు తెలిసిందన్నారు సజ్జనార్.