వరద ఉధృతికి కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు

వరద  ఉధృతికి కొట్టుకుపోయిన ఆర్టీసీ బస్సు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.గంభీరావు పేట-లింగన్నపేట సరిహద్దులోని మానేరువాగు లోలెవల్ బ్రిడ్జిపై  వరద ప్రవాహంలో చిక్కుకున్న బస్సు కొట్టుకుపోయింది. నిన్న వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో  వంతెనపైనే  బస్సును వదిలేసి క్షేమంగా బయటకు వచ్చారు డ్రైవర్, కండక్టర్,  ప్రయాణికులు.  ఇవాళ ఉదయం వాగుకు వరద ఉదృతి ఎక్కువగా ఉండడంతో బస్సు కొట్టుకుపోయింది.