మహాలక్ష్మీ స్కీం: 24 కోట్ల మంది ఫ్రీ బస్ జర్నీ

మహాలక్ష్మీ స్కీం:  24  కోట్ల మంది ఫ్రీ బస్  జర్నీ

తెలంగాణలో  కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్ష్మి స్కీంకు మంచి స్పందన వస్తోంది.  ఈపథకం ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 24 కోట్ల జీరో టికెట్స్ జారీ చేశామని టీఎస్ఆర్టీసీ ప్రకటించింది.  ప్రతి రోజు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు తెలిపింది.  మహాలక్ష్మీ స్కీంతో  నష్టాల్లో ఉన్న ఆర్టీసీ  లాభాల్లోకి వస్తుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.  మహాలక్ష్మి పథకం పేరుతో అత్యుత్తమ విధులు నిర్వహిస్తున్న  మహిళా ఉద్యోగులకు అవార్డులు అందజేయాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు సూచించారు.  టీఎస్ ఆర్టీసీ  బాగుకోసం ఉద్యోగుల నుంచి సలహాలు సూచనలు తీసుకుంటామని తెలిపారు.

ALSO READ :- Gama Awards: టాలీవుడ్ గామా అవార్డ్స్‌..బెస్ట్ ట్రెండింగ్ యాక్టర్ ఎవరంటే?

త్వరలోనే ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఆర్టీసీలో ఉత్తమ ఉద్యోగులకు అవార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. 2017,2021 పీఆర్సీ పెండింగ్ బిల్స్ పై చర్చిస్తున్నామన్నారు. రాష్ట్రానికి పునాది ఆర్టీసీ అని అన్నారు. ఉద్యోగులు మేడారం జాతర కోసం చాలా కష్టపడ్డారని ప్రశంసించారు. ఆర్టీసీని నష్టా ల్లో నుంచి లాభాల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు. పెండింగ్ బిల్స్ పై త్వరలో సానుకూల నిర్ణయం ఉంటుం దన్నారు.