ఆర్టీసీ బస్సులో సజ్జనార్ ఫ్యామిలీ

V6 Velugu Posted on Nov 30, 2021

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో సారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతను చేపట్టినప్పటి నుంచి తనదైన మార్క్ చూపిస్తున్నారు. ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఎవరైనా ఆర్టీసీకి సంబంధించి ఏమైనా సమస్యలను లేవనెత్తితే... వెంటనే వాటిపై స్పందిస్తున్నారు. అనేకసార్లు ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడి సమస్యల్ని తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా మరోసారి సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. అయితే ఈసారి ఆయన తన ఫ్యామిలీతో కలిసి ఈ జర్నీ చేయడం విశేషం. సజ్జనార్ కుటుంబంలో చిన్నా పెద్ద అంతా కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కారు. 

అంతే కాదు బస్సులో స్టెప్పులు కూడ వేశారు. సజ్జనార్ కూడా కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తూ ప్రయాణం చేశారు. అంతా ఆహ్లాదంగా బస్సులో ఆడుతూ పాడుతూ కనిపించారు. టీఎస్ ఆర్టీసీ బస్సు సపరివార సమేతంగా బస్సులో ప్రయాణానికి మంచిదని మెసేజ్ ఇచ్చింది సజ్జనార్ కుటుంబం. ఆర్టీసీ బస్సులో ప్రయాణం రక్షితం,సుఖమయం,శుభప్రదం అనే మెసేజ్ ఇచ్చేలా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 

 

Tagged RTC Bus, TSRTC MD Sajjanar, sajjanar family, sajjanar dance, sajjanar family dance

Latest Videos

Subscribe Now

More News