ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేలా డిజిటల్ సేవలు

ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేలా డిజిటల్ సేవలు

హైదరాబాద్: డిజిటల్ టికెటింగ్ విధానాన్ని వేగవంతం చేస్తోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC). ఒక పక్క ఆదాయాన్ని పెంచుకుంటూనే.... మరోవైపు క్యాష్ లెస్ టికెట్ తో ప్రయాణీకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బస్టాండ్స్ లో క్యూఆర్ పద్ధతిలో రిజర్వేషన్ టికెట్స, బస్సు పాసులను కౌంటర్లలో ఇస్తుండగా.... తాజాగా ఐ టిమ్ తో బస్ స్టేటస్ టికెట్స్ ఇష్యూను అందుబాటులోకి తీసుకొచ్చారు.
కొన్నేళ్లుగా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని లాభాల్లోకి తెచ్చేందుకు ఉన్న మార్గాలు, అవకాశాలు, లోపాలపై దృష్టి సారించి అన్ని ప్రయత్నాలను చేస్తోంది సంస్థ. ప్రయాణీకులకు మరింత చేరువయ్యేందుకు కొత్త కొత్త పథకాలను, ప్రణాళికలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా డిజిటల్ పద్ధతిలో ప్రయాణీకులు టికెట్లు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నగదు రహిత లావాదేవీల కోసం క్యూఆర్ కోడ్ తో పేటిఎం, గూగుల్ పే తో బస్టాండ్లలో రిజర్వేషన్ టికెట్లు పొందేలా అవకాశం కల్పించారు. ఆ తర్వాత విద్యార్థులు ఎక్కువగా యూజ్ చేసే బస్ కౌంటర్లలోనూ ఇదే ప్రయోగం చేశారు. ఇలాగే ఇప్పుడు బస్ సర్వీసుల్లోనూ కొత్త పద్ధతిని ఇంట్రడ్యూస్ చేయడం బాగుందంటున్నారు ప్రయాణికులు. 
అకస్మాత్తుగా ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు డైరెక్ట్ గా బస్టాండ్ వెళ్తే... డబ్బులు లేక ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలను గుర్తించిన ఆర్టీసీ ఇప్పటికే ఓపీఆర్ఎస్ సిస్టంతో రిజర్వేషన్ టికెట్లు, బస్ కండెక్టర్ దగ్గరే డిజిటల్ పేమెంట్స్ చేసేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లోని పలు బస్సుల్లో ఈ ఫెసిలిటీ కల్పించారు. దీంతో బస్సు ఎక్కడ ఉందో... ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో తెలుసుకునే వీలు ఉంటుంది. మున్ముందు రాష్ట్ర వ్యాప్తంగా నడిచే ఏసీ, నాన్ ఏసీ బస్సుల్లోనూ చేసేందుకు ప్లాన్ చేస్తోంది.
ఓ వైపు ప్రయాణీకులకు దగ్గరయ్యేందుకు కొత్త కొత్త ప్లాన్స్ తో ముందుకు వస్తూనే... వారి సమస్యల పరిష్కారం కోసం కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసింది. క్యూఆర్ కోడ్ తో టికెట్లు ఇచ్చే పద్ధతికి ప్రయాణీకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందంటున్నారు ఆర్టీసీ అధికారులు. ఐతే చాలా రూట్లలో క్యాష్ ఇచ్చే పద్ధతే ఉందంటున్నారు. ప్రయాణికుల అవసరాలను బట్టి... ఉన్నతాధికారులు మరిన్ని రూట్లల్లో తెచ్చేందుకు ప్లాన్లు చేస్తున్నారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనే కాకుండా ఇతర జిల్లా సర్వీసుల్లోనూ ఐటిమ్ డిజిటల్ పద్దతితో టికెట్ ఇష్యూ చేయాలంటున్నారు జనం. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టీసీలో మార్పులు తీసుకురావడం శుభపరిణామం అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.