డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ చార్జీల భారం

డీజిల్ సెస్ పేరుతో మరోసారి ఆర్టీసీ చార్జీల భారం
  • కిలోమీటర్ చొప్పున కాకుండా సెస్ పేరుతో బాదుడు
  • నెల రోజుల్లో నాలుగు రకాలుగా చార్జీలు వడ్డించిన ఆర్టీసీ

హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్టీసీ చార్జీలు మరోసారి పెరిగాయి. డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగిపోతుండటంతో చార్జీలు పెంచుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. డీజిల్ సెస్ కింద.. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీలో ఒక్కో టికెట్ పై 2 రూపాయలు, ఎక్స్ ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసుల్లో ఒక్కో టికెట్ పై ఐదు రూపాయలు వసూలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు ఆర్టీసీ తెలిపింది. అయితే.. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీలో మినిమమ్ చార్జీ 10 రూపాయలు గానే ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. పెరిగిన చార్జీలు రేపు ఉదయం నుంచే అమలులోకి రానున్నాయి.
నెల రోజుల్లో నాలుగు రకాలుగా చార్జీలు వడ్డించింది ఆర్టీసీ. టికెట్ పై కిలో మీటర్ చొప్పున చార్జీలు పెంచకుండా.. సెస్ పేరుతో చార్జీలు బాదుతోంది. మార్చిలో మూడు సార్లు టికెట్ రేటు పెరిగింది. చిల్లర సమస్య అంటూ మొదట టికెట్ రేటును రౌండ్ ఫిగర్ చేశారు. తర్వాత సేఫ్టీ సెస్, డెవలప్ మెంట్ సెస్ అంటూ మరింత భారం మోపారు. ఇప్పుడు డీజిల్ సెస్ పేరుతో నాలుగోసారి టికెట్ రేటు పెంచేశారు. గత నెలలో ప్యాసింజర్ సెస్ పేరుతో ఒక్కో టికెట్ పై ఐదు రూపాయల చొప్పున వసూలుకు నిర్ణయం తీసుకున్నారు. ఓవరాల్ రేట్ ను రౌండ్ ఫిగర్ చేశారు. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో సెస్ ఐదు రూపాయలని చెప్పినా.. దాన్ని 10 రూపాయలకు ఫిక్స్ చేశారు. ఇవి కాక.. బస్ పాస్ చార్జీలను భారీగా పెంచారు.
ఆర్టీసీ చార్జీలు పెంచుతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కిలోమీటర్ ఎంత పెంచాలనుకుంటున్నారనే దానిపై సర్కారు ప్రతిపాదనలు కూడా ఇచ్చింది ఆర్టీసీ. అయితే.. కిలో మీటర్ చొప్పున పెంపు ఫైల్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టిన సర్కారు.. సెస్ రూపంలో ప్రజలపై భారం మోపుతూనే ఉంది. 

 

ఇవి కూడా చదవండి

సీఎం సహా ఎమ్మెల్యేలు వందల ఎకరాల్లో ఫాంహౌస్లు కట్టుకున్నారు

టీఆర్ఎస్ ధర్నాలో మున్సిపల్ ఛైర్ పర్సన్కు అవమానం

ఏపీ పునర్విభజనపై సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్