అరుణాచలం గిరిప్రదక్షిణకు స్పెషల్ బస్సులు

అరుణాచలం గిరిప్రదక్షిణకు స్పెషల్ బస్సులు

దిల్ సుఖ్ నగర్, వెలుగు: కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరిప్రదక్షిణకు హైదరాబాద్ -2 డిపో దిల్ సుఖ్ నగర్ నుంచి స్పెషల్ బస్సులు నడుపనున్నట్లు డిపో మేనేజర్ ఎం.కరుణశ్రీ బుధవారం  ప్రకటించారు. నవంబర్ 3న రాత్రి 7 గంటలకు దిల్ సుఖ్ నగర్ నుంచి బస్సు సర్వీసులు ఉంటాయని, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ మీదుగా అరుణాచలం చేరుకుంటాయని తెలిపారు. తిరిగి 5న మధ్యాహ్నం అరుణాచలంలో బయలుదేరి 6న ఉదయం 6 గంటలకు హైదరాబాద్ చేరుకుంటాయన్నారు. ఒక్కరికి టికెట్ చార్జీ రూ.3,900 నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 

టికెట్ బుకింగ్ www.tgsrtcbus.in   వెబ్ సైట్  లేదా దగ్గరలో ఉన్న ఏటీబీ ఏజెంట్ వద్ద రిజర్వేషన్ చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వివరాలకు 99594 44165, 93465 59649, 96663 50995 నంబర్లలో సంప్రదించాలన్నారు. నవంబర్ 2 రాత్రి 7 గంటలకు పంచ శైవ క్షేత్రాల టూర్ ప్యాకేజీ పెద్దలకు రూ.3,200-, పిల్లలకు రూ.1630తో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటకు సూపర్ లగ్జరీ బస్ బయలు దేరుతుందని వివరించారు.