దొరికినంత దోచుకుంటున్న ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది

దొరికినంత దోచుకుంటున్న ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది

ఆర్టీసీ తాత్కాలిక సిబ్బంది దొరికినంత దోచుకో.. అందిన కాడికి దాచుకో అన్నచందంగా వ్యవహరిస్తున్నారు.  ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల్ని ఏర్పాటు చేసింది. సమ్మెతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ప్రైవేట్ సిబ్బందితో ఆర్టీసీ బస్సుల్ని నడిపించే ప్రయత్నం చేస్తుంది. దీన్ని అదునుగా భావించిన తాత్కాలిక ఉద్యోగులు ప్రభుత్వ ప్రయత్నాలకు గండికొడుతున్నారు. జనగామ నుంచి సూర్యాపేట టికెట్ ధర రూ.60 ఉండగా తాత్కాలిక సిబ్బంది రూ.100వసూలు చేస్తున్నారు. టికెట్ ఇవ్వకుండానే డబ్బులు జేబులో వేసుకుంటున్నారు. టికెట్లు అడిగితే టికెట్లు లేవంటూ సమాధానం చెబుతున్నారు. అయితే తాత్కాలిక సిబ్బంది విధుల్లో చేరి ఆయా రూట్లకు వెళ్లి వచ్చిన సిబ్బంది ఎంత ఇస్తే అంత తీసుకోవడం అధికారులు వంతైంది.