టీఎస్ఆర్టీసీలోకి కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులు

టీఎస్ఆర్టీసీలోకి కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(టీఎస్ఆర్టీసీ) కొత్త మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తోంది. మార్చి 12వ తేదీ మంగళవారం ఎలక్ట్రిక్ బస్సులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు హైదరాబాద్ నెక్లెస్  రోడ్ లో ఉన్న అభేద్కర్ స్టాచు దగ్గర ప్రారంభించనున్నారు.  

ఈ ఏడాది ఆగస్టు వరకు మొత్తం 500 బస్సులను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయింది. ఇందులో భాగంగా ఈరోజు నుంచి 22 మెట్రో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి రానున్నాయి. మెట్రో ఎలక్ట్రిక్ బస్సులోనూ మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. మోడ్రన్ లుక్, కంఫర్టబుల్ సిటింగ్  తో తొలిసారి నాన్ ఏసీ ఎలక్ట్రిక్ మెట్రో బస్సులను తీసుకొచ్చింది ఆర్టీసీ. ఎలక్ట్రిక్ మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సులలో సాధారణ ఛార్జీలే ఉంటాయని TSRTC తెలిపింది.