బీసీ గురుకులాల టైమింగ్స్ మార్చండి

బీసీ గురుకులాల టైమింగ్స్ మార్చండి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనివేళలను మార్చాలని స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్(టీఎస్​యూటీఎఫ్) కోరింది. గురువారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్​ను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు జంగయ్య, చావ రవి కలిసి వినతి పత్రం అందజేశారు. ఇతర సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో ఉన్నట్లు బీసీ గురుకులాలను కూడా ఉదయం 9  గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నడపాలన్నారు.

దసరా సెలవుల్లో గెస్ట్ టీచర్ల వేతనాల్లో కోత విధించారని గుర్తుచేశారు. దీనికి స్పందించిన మంత్రి.. అన్ని గురుకులాల్లో ఒకే రకమైన సదుపాయాలు, ఎంప్లాయీస్​కు వేతనాలు ఇస్తున్నామన్నారు. టైమ్సింగ్స్ ఒకే విధంగా అమలు చేస్తామన్నారు. గెస్ట్ టీచర్లకు సెలవుల పేరిట కోత పెట్టిన వేతనం తిరిగి చెల్లిస్తామని తెలిపారు.