మెదక్ టౌన్, వెలుగు: మెదక్జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పద్మా రావు, శ్రీనివాస్‌రావు కోరారు. మంగళవారం డీఈవో విజయను కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలింగ్ ఆఫీసర్లు గమ్యస్థానాలకు చేరడానికి ఆర్టీసీ బస్సులను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలన్నారు.
అన్ని మండలాల్లో పోలింగ్ సిబ్బందికి ఒకే విధమైన రెమ్యూనరేషన్ చెల్లించాలన్నారు. మొదటి విడత ఎన్నికల విధుల్లో పాల్గొని మళ్లీ రెండో విడత ఎన్నికల విధులు వస్తే 12న, రెండోవ దశలో చేసి తిరిగి మూడో విడత విధులు వస్తే 15న ఓడీ సౌకర్యం కల్పించాలన్నారు. గర్భిణీలు, ఫీడింగ్ మదర్స్‌కు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మినహాయింపు ఇవ్వాలన్నారు.

