
శ్రీవారిపై ఉన్న భక్తితో భారీ విరాళాన్ని సమర్పించుకున్నారు హైదరాబాద్ కు చెందిన భక్తుడు. శనివారం హైదరాబాద్‌కు చెందిన ఎమ్.భూపతిరాజు, శారద దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయంలో TTD అధ్యక్షుడు వై.వి. సుబ్బారెడ్డి, తిరుమల ప్రత్యేక అధికారి ఎ.వి. ధర్మారెడ్డిని కలిసి రూ.కోటి విరాళం సమర్పించారు.
విరాళాలకు సంబంధించిన డీడీని అందజేశారు. ఈ మొత్తాన్ని శ్రీవేంకటేశ్వర సర్వశ్రేయ ట్రస్టు కింద డిపాజిట్టు చేయాలని దాత కోరారు. భారీ మొత్తంలో విరాళం ఇచ్చిన దాతలను సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు వారికి అందించారు TTD అధికారులు. తిరుమలలో నిత్య అన్నదానం లాంటి సేవలు అద్భుతమని అందుకే ఈ విరాళాన్ని ఇచ్చినట్లు తెలిపారు దాత.